తెలంగాణా రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ సెల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి /జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.. పోలీసులు ,ఎస్,ఎస్టి ,ఎఫ్ ఎస్ టీంలు చేసిన తనిఖీ లలో ఎక్కడైనా 50వేల రూపాయల కన్నా అధికంగా రవాణా చేస్తున్నట్లు గుర్తిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా , సందేహాస్పదంగా ఉంటే వాటిని వెంటనే సీజ్ చేయాలని తెలిపారు. లక్ష నుండి పది లక్షల వరకు ఉన్నచో ఇట్టి సమాచారాన్ని ఇన్కమ్ టాక్స్ అధికారులకు సమాచారం అందించాలన్నారు.10 లక్షల రూపాయల వరకు సరైన ఆధారాలు ఉంటే సీజ్ చేయము , కానీ ఇన్కమ్ టాక్స్ శాఖ కి సమాచారం అందించాలని తెలిపారు . జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో, పట్టుబడిన నగదుకు సరి అయిన పత్రాలను,ఎన్నికలగ్రీవెన్స్ విభాగం లో సమర్పించి, తిరిగి తమ నగదును పొందవచ్చని తెలిపారు. ఎన్నికల గ్రీవెన్స్ టీం,పి.డి.డి ఆర్.డి.ఏ శ్రీనివాస్. నెం: 9281484100, జిల్లా అడిట్ అధికారి, జి . రాకేష్ .నెం :9948213828, జిల్లా ట్రెజరీ అధికారి చిన్న సాయిలు, నెం: 7799934150. ఫోన్ నంబర్లను అందజేశారు .