తెలంగాణలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. స్థాయిలు సాధారణ స్థాయిని దాటుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జంకే పరిస్థితి. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వివిధ ప్రాంతాల్లో బయటికి వెళ్లిన వారు ఎండ తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు.శుక్రవారం సాధారణ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు ఉండాల్సి ఉండగా, గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది.