మార్పుకు నాంది ముట్పూర్ నుంచి ప్రారంభం

ముట్పూర్ గ్రామం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు

రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆగడాలు ఎక్కువయ్యాయని, షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా బిఆర్ఎస్ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని అందుకే రాష్ట్రంలో, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కోరారు. గత రెండు శాసనసభ ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలుపరచలేదని అందుకే కెసిఆర్ ప్రభుత్వం పై విసుగు చెంది టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని గ్రహించి ఆదరాబాదరగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని పాత రోడ్లే వేయని బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రోడ్లు వచ్చినట్టుగా భ్రమలు కల్పిస్తున్నారని ఈ కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని దమ్ముంటే పాత హామీలన్నిటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ఏ ఒక్క కార్యకర్తకి నష్టం జరిగిన అందుబాటులో ఉంటానని అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొంతమంది గ్రామస్తులు ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడుపూర్తిగా రుణమాఫీ చేసిందని, భూములు పంచిందని, వ్యవసాయానికి సబ్సిడీ ఇచ్చిందని, ఆరోగ్యశ్రీ అమలు చేసిందని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీస్ ని కచ్చితంగా అమలు చేస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ మార్పు అవసరమని అందుకోసమే ఖచ్చితమైన విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జితేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు, రవి,నర్సింలు, శ్రీనివాస్,విజేందర్, శివ,గ్రామ పెద్దలు రామ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణారెడ్డి, రఘునాథ్ రెడ్డి, నరసింహారెడ్డి,అంతిరెడ్డి, అంజిరెడ్డి, రవీందర్ రెడ్డి, రాజు, రాములు, మరియు గ్రామ పెద్దలు కొత్తగా పార్టీలోకి చేరిన నాయకులు పాల్గొన్నారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!