ఎలక్షన్ కోడ్ అమలు చేయండి

బిజెపి షాద్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టి. విజయ్ కుమార్

షాద్ నగర్ అసెంబ్లీలో ప్రభుత్వం అధికారులు ఎలక్షన్ కోడ్ అమలు చేయాలని అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని బిజెపి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టి విజయ్ కుమార్ కోరారు. గురువారం షాద్ నగర్ ఆర్డిఓ అధికారిని కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో సహా ఇతర ప్రాంతాల్లో ప్రచార ఫ్లెక్సీలను ఇతర ప్రచార సాధనాలను వెంటనే తీసివేయాలని వినతిపత్రంలో కోరారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎమ్మెల్యే క్యాపు కార్యాలయంలో జరుగుతున్న కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని ఆయన సందర్భంగా కోరారు. ఇదిలా ఉండగా ఫిర్యాదు స్వీకరించిన అధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రచార ఫ్లెక్సీలు ఇతర మెటీరియల్ ఏవి లభించలేదని స్వచ్ఛందంగా ఇదివరకే అన్ని తొలగించారని తెలిపారు. బిజెపి చేసిన ఆరోపణలు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు కొట్టిపారేశాయి..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!