టీడీపీ నాయకుల పిలుపు
17వ రోజుకు చేరిన తెలుగు దేశం దీక్షలు
షాద్ నగర్ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కు పార్టీలకతీతంగా ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఉందని షాద్ నగర్ తెలుగు దేశం పార్టీ నాయకులు చల్లా వేంకటేశ్వర్ రెడ్డి, గంధం ఆనంద్, జిల్లెలె బాల్ రెడ్డి, కుమార్ గౌడ్, రాయల్ శంకర్, యండి రహూఫ్, కే రాం చంద్రయ్య, విఠ్యాల తదితరులు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరస్ట్ కు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో 17వ రోజుకు చేరుకున్నాయి. ఎంతో నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అలాంటి నాయకుడి పై లేనిపోని ఆరోపణలు చేసి కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని జగన్ ప్రభుత్వానికి వారు సూచించారు. దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న వారిలో బంగారు రాములు, అన్మారి వెంకటయ్య, విఠ్యాల అంజయ్య, బి క్రిష్ణయ్య, యం డి రుక్మోద్దీన్, ఆర్ నర్సంలు విఠ్యాల, గంటెల శంకరయ్య, దాసరి అనంతయ్య, దూస్కల్ క్రిష్ణ, ఎ భాస్కర్ రెడ్డి, యస్. నర్సింలు, కె అంజయ్య గౌడ్, బి. రాంలు గౌడ్ తదితరులు ఉన్నారు.