టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన జయశంకర్‌ను తెలంగాణ సమాజం మర్చిపోదని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొపెసర్ జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండాల రాములు మండల పార్టీ ఉపాధ్యక్షులు పాండు యాదవ్ హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ సేవలు మరువలేనివని, ఆ మహనీయుని విగ్రహాన్ని చేవెళ్లలో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జయశంకర్ కలలు కన్న తెలంగాణకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ రెడ్డి కార్తీక్ రెడ్డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు