అధిక ధరలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు
– నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 07, మహానంది:
లాడ్జిల యజమానులు అధిక ధరలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.శనివారం మహానంది గ్రామంలో లాడ్జిలు నిర్వహిస్తున్న యజమానులతో నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి,సీఐ రవీంద్ర మహానంది పోలీస్ స్టేషన్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతి లాడ్జి నందు తారిఫ్ పట్టికను ఏర్పాటు చేయాలని, సెలవు దినాలు అధిక వసూలు చేయరాదని, రికార్డులు సక్రమంగా నా
నమోదు చేయాలని తెలిపారు. ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై నాగేంద్రప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.