క్యాన్సర్ బాధిత వ్యక్తికి కుటుంబానికి ఆర్థిక సహాయం
4వేల నగదు ,100 కేజీల బియ్యం అందజేత
దాతలు సహాకారం అందించండి
స్టూడియో 10 టీవీ న్యూస్ , అక్టోబర్ 06, మహానంది
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి వైసిపి నాయకులు గజ్జ పెద్ధపక్కీరయ్య ఆర్థికసాయం శుక్రవారం అందజేశారు.మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన తుడిమెళ్ళ పెద్ద హసన్ కుమారుడు మహబూబ్ బాషా గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం.కాగా వీరి కుటుంబానికి గాజులపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గజ్జ పెద్దపకీరయ్య పరామర్శించి, తన వంతు సహాయంగా నాలుగు వేల రూపాయలు నగదు మరియు 100 కేజీల బియ్యాన్ని అందించటంతో పాటు, తమకు ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా తను ముందు ఉంటానని భరోసా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తుడిమెళ్ళ మహబూబ్ బాషా నిరుపేద కుటుంబం అని, ఇటువంటి వారికి దాతల సహకారం ఎంతో అవసరమని, దాతలు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కరీం భాషా, మదర్సా, బడే భాష, రోసన్న, తదితరులు పాల్గొన్నారు.