60 కోట్ల తో మెదక్ జిల్లా లో ఎరుకల సాధికారత తో ఆత్మ గౌరవం — మంత్రి శ్రీమతి. సత్యవతి రాథోడ్.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నది— మంత్రి టి . హరీష్ రావు *గిరిజనుల సంక్షేమం కు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది: సత్యవతి రాథోడ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. 05-10-2023 మెదక్ జిల్లా స్వతంత్రం వచ్చాక మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, గిరిజన , మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జరిగిన ఎరుకల సాధికారిక పథకం ప్రారంభోత్సవానికి, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి హాజరయ్యారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరుకల సాధికారత పథకం మొట్టమొదటిగా మెదక్ జిల్లాలో అమలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎరుకల కులస్తులు వ్యాపార మెలకువలు నేర్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.