ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏడుపాయలు నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుపాయల్లో భక్తులకు వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నిధులతో ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలా గౌడ్ ఆలయ ఈవో మోహన్ రెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి ధర్మకర్తలు మానమ్మ కిషన్, సిద్ధిరాములు, వెంకటేశం, మనోహర్,నాగభూషణం,మోహన్రావు, సాయిలు,పెంటయ్య చక్రపాణి , రఘువీర్ నాయకులు లక్ష్మణ్ గౌడ్ రాగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.