మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు
షాద్ నగర్ : ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందుల గురి చేస్తుందని, త్వరలోనే నిర్దోషిగా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్ష కార్యక్రమాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బక్కని నరసింహులు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసిన ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడని చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీ వెంకటేశ్వర రెడ్డి, నాయకులు అన్మారి వెంకటయ్య, సింగిల్ విండో మాజీ చైర్మన్ జై బాల్రెడ్డి, నందిగామ టిడిపి ప్రెసిడెంట్ కుమార్ గౌడ్, సింగారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..