గాజులపల్లెలో ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 26, మహానంది:
ప్రజాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమం మహానంది మండలంలో చురుగ్గా సాగుతోంది.మంగళవారం గాజులపల్లె గ్రామంలో ఏఎన్ఎం లు దుర్గాదేవి,సుధారాణి ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రతి కుటుంబంలో వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధిత యాప్లో వివరాలు నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.