మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖానికి గాయం.. పదిరోజులు రెస్ట్ !
ముఖానికి గాయం అవ్వడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారట చరణ్. గాయంమానిన తర్వాత గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ముఖానికి గాయం కావడంతో ఇంట్లోనే ప్రధమిక చికిత్స అందిస్తున్నారట. అయితే పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపినట్టు నమాచరం. అయితే రామ్ చరణ్ కు గాయమైనట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులు ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.