బకాయిలు చెల్లించని పొదుపు సంఘాలపై చర్యలు తప్పవు
– సెర్ప్ రాష్ట్ర జూనియర్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసులు
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 26, మహానంది:
బకాయిలు చెల్లించని పొదుపు లక్ష్మి గ్రామైక్య సంఘాలపై చర్యలు తప్పవని సెర్ప్ రాష్ట్ర జూనియర్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం మహానంది మండలం బుక్కాపురం మండల ఐక్య సంఘం పొదుపు భవనంలో ఎస్. ఎస్. సి. సబ్ ప్లాన్ కింద రుణాలు పొందిన సంఘాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని తమ్మడపల్లె నవోదయ గ్రామ సంఘం రూ. 6.5 0 లక్షలు, గాజులపల్లె లోని సూర్య గ్రామీక సంఘం రూ. 2.95 లక్షలు పక్కదారి పట్టినట్లు గుర్తించామన్నారు అలాగే తిమ్మాపురం లోని మధుర గ్రామ సంఘం , ఆర్ఎస్ గాజులపల్లి లోని ఆదర్శ గ్రామ సంఘం తో పాటు మరికొన్ని గ్రామాల్లో గల గ్రామ్య సంఘాలు రూ. 50 వేల లోపు నగదు పక్కదారి పట్టినట్లుగా గుర్తించినట్లు వివరించారు. వసూలు చేయాలని మండల ఏపీఎం శ్రీనివాసలను ఆదేశించారు. మండలంలోని గ్రామైక్య సంఘాలకు రూ .45 లక్ష లకు పైగా ఎస్ఎస్సి సబ్ ప్లాన్ కింద సభ్యుల జీవనాభివృద్ధికి రుణాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.ఈ సమావేశంలో ఏపిఎం శివ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.