వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చేవెళ్ల మండల కేంద్రంలోని వివేకానంద జూనియర్ & డిగ్రీ కళాశాలలో ఎప్పటిలాగే మట్టి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి & డైరెక్టర్ ఇంద్రసేన రెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహానికి గత వారం రోజులుగా అనునిత్యం పూజలు చేసామన్నారు. ప్రతి ఒక్కరూ మున్ముందు కలర్లతో కూడిన విగ్రహాలను పెట్టొద్దన్నారు. దాని ద్వారా నీటి కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులందరూ విద్యలో రాణించాలంటే కష్టంతో పాటు భక్తిశ్రద్ధలు కూడా ఉండాలని ఆయన గుర్తు చేశారు. గణనాథుని ముందు విద్యార్థినీ విద్యార్థులు భక్తి పాటలు తో నృత్యాలు చేశారు. గత వారం రోజులుగా పూజలు అందుకుంటున్న గణనాతుని ప్రసాడం లడ్డూని లాటరీ పద్ధతిన లక్కీ డ్రా తీయగా ఈర్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్ధి వేణు గౌడ్ కి (డిగ్రీ బీకాం కంప్యూటర్ ఫస్ట్ year) లక్కి డ్రా లో గెలుపొందడం జరిగింది. అనంతరం గణనాథుని ప్రసాదాన్ని లక్కీ డ్రాలో గెలుపొందిన విద్యార్థి వేణుగౌడ్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, వివేకానంద నగర్ కాలనీ వాసులు పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం వినాయకుడి నిమజ్జనం కోసం బీచ్ పల్లి వెళ్ళారు.