దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి మరింత వేగవంతం..
-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 27, మహానంది:
మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివారిని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వీరికి ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, పాలక మండలి చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి లు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు చేయించారు.పూజల అనంతరం ఆలయ ఈవో ఎమ్మెల్యే దంపతులను శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి జ్ఞాపికను అందజేయగా,వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి,తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానంది ఆలయ అభివృద్ధికి దాతల సహకారం తోడు కావడంతో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. క్షేత్రంలో భక్తుల వసతి కోసం టీటీడీ దేవస్థానం నిధులతో నాలుగు కోట్ల 60 లక్షలు తో వసతి గృహాల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వీటితోపాటు దాతల సహకారంతో మరో 50 రూములు నిర్మాణానికి కూడా కమిషనర్ అనుమతులు పొందామన్నారు. మహానంది క్షేత్రానికి నంది సర్కిల్, మాడా వీధుల చుట్టూ ల్యాండ్ స్కేపింగ్ పనులు మా సొంత నిధులతో జరుగుతున్నాయని, అదేవిధంగా క్షేత్రంలోని బయటి రెండు కోనేరులు 80 లక్షల రూపాయలతో పనులు జరుగుతున్నాయి అన్నారు. ముఖ్యంగా మహానంది క్షేత్రంలో చాలా సంవత్సరాలుగా నిజరూప దర్శన సేవలు భక్తులకు నిరంతరం లేకపోవడంతో తిరిగి స్వామివారి నిజరూప దర్శనం నిరంతరం భక్తులకు కల్పించే విధంగా ఈరోజు నుండి సేవలు ప్రారంభించామన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే వడ ప్రసాదంగా ఇవ్వబడుతుంది దీనిని పరిశీలించి మహానంది క్షేత్రంలో కూడా ఈరోజు నుండి వడ ప్రసాదములు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రారంభించామన్నారు. క్షేత్ర పరిసరాలలో క్యూలైన్లు కాని గ్రిల్స్ కానీ ఏవి కూడా ఇనుప వి ఉండకూడదనే భావనతో కంచు లేక స్టీలు గ్రిల్స్ ఏర్పాట్లకు ఆలయ నిధులతో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయ అభివృద్ధిలో సహకరిస్తున్న ఆలయ ఈవోను, పాలకమండలి సభ్యులను, దాతలను ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. దర్శనానంతరం ఎమ్మెల్యే మహానంది గ్రామంలోని రూ.20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, ఎస్వీఆర్ కళ్యాణ మండపంను ఎమ్మెల్యే శిల్పా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ నాగభూపాల్ రెడ్డి, మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని, ఎంపీడీవో శివ నాగజ్యోతి, మహానంది మండలం వైసిపి నాయకులు భూమా సుబ్బరామయ్య, , ఒంటెద్దు వీరారెడ్డి, కొండా మధుసూదన్ రెడ్డి, గజ్జ పెద్ధపక్కీరయ్య, వైసిపి నాయకులు, ఆలయ సిబ్బంది, ధర్మకర్త మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.