*53 ఎకరాల వరి సాగు చేస్తున్న కౌలు రైతుకు ఘనసన్మానం.*
— గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు ఆధ్వర్యంలో..
_అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని మోదుకూరు గ్రామానికి చెందిన గొడుతి అబ్బులు చౌదరి అనే కవులు రైతు గత కొన్ని రోజులుగా సుమారు 53 ఎకరాల వరిసాగు చేస్తు అధిక దిగుబడులు సాధించానన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో భాగంగా గుమ్మిలేరు గ్రామంలో 40 ఎకరాల వరిసాగు, మోదుకూరు గ్రామంలో 13 ఎకరాల వరిసాగు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు ఆయనను ఉత్తమ రైతుగా గుర్తించి మండల సర్వసభ్య సమావేశం అనంతరం పలు శాఖల అధికారుల సమక్షంలో దృశాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతన్నని రైతు బాగుంటే దేశం బాగుంటుందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి, ఎంపీడీవో కే.జాన్ లింకన్, పశుసంవర్ధక శాఖ ఏడి ఎల్,అనిత,మండల వ్యవసాయ అధికారిని సోమిరెడ్డి లక్ష్మి లావణ్య, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు._