సాగునీరు విడుదలపై అధికారులు, ప్రజాప్రతినిధుల ధ్వంద ప్రకటనలు సరికాదు.
రైతులను మోసం చేస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ నీటి దోపిడీని అడ్డుకోండి.
కృష్ణా, తుంగభద్ర నదులలోని రాయలసీమ రైతుల వాటా నీళ్లు ఇవ్వడానికి ఇబ్బందేంటని బైరెడ్డి ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధులకు
రాయలసీమ ప్రజలకు కష్టాలు పట్టడం లేదు.
రాయలసీమ రచ్చబండలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన బైరెడ్డి.
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 22, మహానంది
రాయలసీమలోనే ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రాగానే విద్యుత్ ఉత్పత్తి పేరుతో అటు తెలంగాణ, ఇటు జగన్ ప్రభుత్వం తోడేస్తూ నాగార్జున సాగర్ కు తరలించి కృష్ణాడెల్టా ను కాపాడుతూ రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందకుండా చేయడం అన్యాయమని, శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరీజీని కూడా తోడేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని పెద్దమ్మ అరుగు వద్ద రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాయలసీమ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
ఈ రాయలసీమ రచ్చబండకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నదులలో సరిపడ నీరు లేదు కేసి కెనాల్, ఎస్ ఆర్ బి సి, తెలుగుగంగా తదితర ప్రధాన పంటకాల్వల క్రింద ఆయకట్టు రైతులు ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షధార ( ఆరుతడి) పంటలు వేసుకోమని అధికారులు ప్రకటిస్తారు.మంత్రులు, ఎం. పి. ఎమ్మెల్యేలు మాత్రం నదులలోని అరకొర నీటిని గేట్లు ఎత్తి రైతులకు సాగునీరు విడుదల చేస్తున్నాం అంటూ ప్రకటన చేస్తున్నారు.ఈ విరుద్ధ ప్రకటనలతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారని, ఇప్పటికే వేసిన పంటలకు నీరు ఎలా అని కొందరు రైతులు, నీరు ఎప్పటి వరకు వస్తుందో పంటలు సాగుచేయాలో లేదో అని మరికొందరు రైతులు ఆందోళన చెందుతున్నారన్నారని, రైతులను మోసం చేస్తే జగన్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించ్చారు. గత ఏడాది తుంగభద్ర, కృష్ణానదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు ధాటి ప్రకాశం బ్యారేజ్ గుండా సుమారు 2000 ల TMC నీరు నిరుపయోగంగా సముద్రంలో కలిచాయని ప్రభుత్వం అధికారికంగా లెక్కలు చెబుతోందని, జగన్ ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందని, అందువల్లే నీటి కష్టాలు అన్నారు.గత ఏడాదే సముద్రం పాలు కాకుండా వెలుగోడు, గోరుకల్లు, అవుకు, బ్రహ్మసాగర్, మైలవరం, గండికోట, సర్వరాయ సాగర్ తదితర రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీరు నిలువ చేసుకొని ఉంటే ఈ కరువు పరిస్థితిలో కూడా నీరు లేదు అనే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చేది కాదు కదా అని బైరెడ్డి నిలదీసారు.కేంద్రం నిధులతో నిర్మించాల్చిన జాతీయ ప్రాజెక్టు పోలవరంను తామే నిర్మించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాతో పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసి ఆ నిధుల కోసం కేంద్రం చుట్టూ ప్రధక్షిణలు చేయండ ఏంటని, మన రాష్ట్ర నిధులతో పోలవరం కాకుండా తుంగభద్రనదికి ఎగువ సమాంతర కాలువ, వేదవతి, గురురాఘవేంద్ర, కుందూనదిపై మంజూరైన ఎత్తిపోతల పథకాలు, కేసి కెనాల్ స్థిరీ కరణకు మంజూరు అయినా గుండ్రేవుల రిజర్వాయర్లు, ఇదేళ్లుగా కుంగి చుక్క నీరు నిల్వ చేయని అలగనూరు రిజర్వాయర్ కు మరమ్మత్తులు ఈ నాలుగేళ్లలో పూర్తి చేసి ఉంటే రాయలసీమలో కరువు కనపడేది కాదన్నారు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంగా రాయలసీమ సమాజం భావిస్తుందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర, నవళి ప్రాజెక్టులు కడుతోందని, ఈ అక్రమ ప్రాజెక్టుల వల్ల తుంగభద్ర నది నుండి దిగువనకు చుక్కనీరు రాదని రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆ ప్రాజెక్టులు వెంటనే అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాయలసీమలో 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనే 1951 లో కేంద్ర ప్లానింగ్ కమీషన్ అనుమతి ఇచ్చిన కృష్ణా – పెన్నార్ ప్రాజెక్టు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై నిర్మాణం చేయకుండా కోస్తాంద్ర నేతల లాభింగ్ తో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టుకొని ఆనాడే రాయలసీమకు గొంతు కోశారని,
70 ఏళ్ల అనంతరం రాయలసీమ ప్రజలు ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఆ కృష్ణా – పెన్నార్ ప్రాజెక్టు స్థానంలోనే సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై కేంద్ర ప్రభుత్వం 167K జాతీయ రహదారి మంజూరు చేసి రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఐ కానిక్ బ్రిడ్జి ( తీగల వంతెన) సుమారు రూ.1200ల కోట్లతో మంజూరు చేసిందని, ఈ తీగల వంతెన వల్ల రాయలసీమ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, తీగల వంతెన బదులు బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మాణం చేస్తే సంగమేశ్వరం వద్ద సుమారు 70 TMC ల నీరు నిలిచి శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణగా ఉంటుందని, ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ కు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాలకు నీరు అందుతుందని, రాయలసీమ ప్రజల దాహార్థి తీరి, కరువు, వలసలు నివారణకు కృషి చేయవచ్చని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివరించారు. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడులకు ఎంతో సఖ్యత ఉంటుందని, ఇద్దరు వారి పనులు చేయించుకుంటు కరువు కోరల్లో కష్టాలు ఎదుర్కోంటున్న రాయలసీమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని విమర్శించారు. జగన్ కు, చంద్రబాబుకు జన్మనిచ్చిన రాయలసీమ రుణం తీర్చుకునేందుకు ఇద్దరు నేతలు కృష్ణానదిపై తీగల వంతెన బదులు బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మాణం చేయాలని, అప్పర్ భద్ర, నవళి ప్రాజెక్టులు ఆపాలని, రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం రాయలసీమ ఇచ్చిన ప్రతేక నిధులు రాబట్టేలా కృషి చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబుల మౌనం రాయలసీమకు శాపంగా మారిందన్నారు.వీరి అసమర్ధత, చేతగానితన్నాన్ని ప్రజలకు వివరిస్తూ, నీళ్లు, నిధులు, నియామకాలలో రాయలసీమకు సమాన వాటా కావాలంటూ ప్రజల్లో చైతన్యం కోసం 8 జిల్లాల్లో రాయలసీమ రచ్చబండ నిర్వహిస్తున్నామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో MRPS దండోరా జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగశేషు, గోపవరం ఎంపీటీసీ రాఘవేంద్ర, మాజీ సర్పంచ్ కృపానందం, MRPS శ్రీశైలం అధ్యక్షులు పి. మధు, గాజులపల్లి ఖాదర్ వలి, షాంసిర్, dr. రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.