తన పుట్టనరోజు సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ పంచిన
బీజేవైఏం మండల ఉపాధ్యక్షులు టి.క్రిష్ణమోహన్
చేవెళ్ల మండలం పామేన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు బిజేవైఏం మండల ఉపాధ్యక్షులు టి. క్రిష్ణమోహన్ తన పుట్టిన రోజు సందర్భంగా నోటు పుస్తకాలు స్టేషనరీ సామగ్రి పంచారు. ఈ కార్య్రమానికి చేవెళ్ల బీజెపీ మండల ప్రధాన కార్యదర్శి ఆత్తెల్లి అనంత్ రెడ్డి హాజరయ్యారు. మంచి చదువులు చదివి రేపటి పౌరులుగా దేశానికి సేవలు అందించే విధంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేష్, బీజేపి సీనియర్ నాయకులు మల్లారెడ్డి, భీ జే వై ఎం నాయకులు ప్రవీణ్, శేఖర్ రెడ్డి, దళిత మర్చా మండల అధ్యక్షులు అశోక్, పమేన దళిత మొర్చా నాయకులు బాల్ రాజ్, నాయకులు రాంరెడ్డి, మండల ఓబీసీ కార్యవర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, గ్రామస్థులు నిరంజన్,హరిహర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.