పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం
వికారాబాద్, ఆగస్టు 15 : పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వికారాబాద్ లోని శ్రీ అనంత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహం అందించారు. వికారాబాద్ లొని కొత్త గడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 2022 -2023 పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అనంత్ రెడ్డి హాస్పిటల్ దివంగత మాజీ డైరెక్టర్ డాక్టర్ అనంత్ రెడ్డి జ్ఞాపకార్థం అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్న ఆరుగురు విద్యార్థులు కడిగే దీపిక, సిరిపురం రుచిత, వర్త్య త్రిష, తలారి భార్గవి, వడ్డే మౌనిక, మెగావత్ సబిత లకు రూ.20 వేల నగదు బహుమతి వారి కుమార్తె డాక్టర్ గిరీష చేతుల మీదుగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాద్యాయుడు మదుసూదన్ రెడ్డి అనంత్ హస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గిరీష కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు నర్సిములు, అనంతయ్య, ఉమెశ్, కిష్టయ్య సి.నర్సింలు హేమలత సరస్వతి, ఫాతిమా బేగం నర్సింలు, శ్రీనివాసులు, బుచ్చిరెడ్డి, నాగేందర్, సంగీత, ఎస్ఎంసి చైర్మన్ మాజీ కౌన్సిలర్ రాములు విద్యార్థులు పాల్గొన్నారు.