విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి.
— ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ రవికుమార్ పిలుపు..
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 25వ తేదీన జరగబోయే విద్య సంస్థల బంద్ ను జయప్రదం చేయాలని మండల కేంద్రమైన ఆలమూరు స్థానిక సమతా కార్యాలయంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ జి. రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలుచేయలేదని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించి హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు,ధరలకు అనుకూలంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచాలని,పెండింగ్లో ఉన్నటువంటి కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బంద్ కు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్, జిల్లా కార్యవర్గం వై.సాయి, పి.సురేష్, వి.కుమార్, బి.రమణ, డి.శ్యాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు..