ఇబ్రహీంపట్నం,
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 23 వ వార్డులో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.కాలనీల్లో మరమ్మతులకు గురైన దీపాలను నెలల తరబడి పట్టించుకునేవారే కరవయ్యారనీ కాలనీ వాసులు తెలిపారు.దీని ఫలితంగా స్థానికులు రాత్రి వేళల్లో అంధకారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పగటి పూట వెలుగుతూ విద్యుత్తు దుబారాతో పాటు ప్రజాధనం దుర్వినియోగమవుతున్న అధికారులు చూస్తుంటారు.కానీ పాడైపోయిన విద్యుత్ దీపాలను మరమ్మతులు చేపించడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు.అసలే వర్షాకాలం కావడంతో రాత్రి వేళలో వాహనదారులు, పాదాచారులకు, రోడ్లంతా గుంతలో ఉండడంతో వీధి దీపాలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతాయి వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని మున్సిపాలిటీలోని 23వ వార్డు ప్రజలు కోరుకుంటున్నారు.