బెంగళూరు:-బీజేపీని గద్దె దించేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా రెండో రోజు సమావేశం జరుపుతున్నాయి. ఈ సందర్భంగా వచ్చే 2024 ఎన్నికల్లో ప్రధాని మోడీని గద్దె దించేందుకు ఏకమైన విపక్ష నేతలు తమ కూటమికి కొత్త పేరును పెట్టారు. అయితే.. కూటమికి ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (ఇండియా), (భారత జాతీయ ప్రజాస్వామ్య ఐక్యత కూటమి) పేరును పెట్టినట్లు ఆర్‌జేడీ, శివసేన (ఉద్దవ్ తాక్రే వర్గం) స్పష్టం చేసింది.
యూపీఏ ఛైర్ పర్సన్‌గా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీయే ఈ కూటమికి చీఫ్‌గా బాధ్యతలు చేపడతారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. సాంఘిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఒకే భావజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడుతామని అన్నారు. కాంగ్రెస్‌కు పీఎం పదవిపై ఆసక్తి లేదన్నారు. మరోవైపు విపక్షాల కూటమి పేరు అనౌన్స్ తర్వాత సోషల్ మీడియాలో ఇండియా వర్సెస్ ఏన్డీఏగా ట్రెండింగ్ అవుతుంది.