ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోసం-మహా ఉద్యమం భాగంగా చేలో హైదరాబాద్,ఆగస్టు 1,కథనభేరి సభ కార్యక్రమం సందర్బంగా ఏబీవీపీ 18,19 విస్తరక్ యోజన నిర్వహిస్తుంది,చేవెళ్ల శాఖ విస్తరక్ గా వంగ.సంజీవ రెడ్డి,క్యామ.శ్రీకాంత్ పాల్గొని నగరంలో మొదటి రోజు కళాశాలలు పర్యటన చేసి తరగతి గదుల్లో మహా ఉద్యమం గురించి ప్రస్థావించారు.
ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు కోసం 1200మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం లాభం పొందుతున్నారని, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు,విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 5300కోట్ల స్కోల్లర్షిప్ పెండింగ్ లో ఉందని, ప్రభుత్వ కళాశాలల్లో,పాఠశాల్లో మౌలిక వసతులు కారువయ్యాయి అని, హాస్టల్ పరిస్థితులు మరి దయనీయంగా ఉన్నాయని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని,రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఈ రాష్ట్రంలో విద్య వ్యతిరేక పాలనా కొనసాగుతుందని వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేసారు అదే విదంగా ఆగస్టు 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ సభని విజయవంతం చేయాలనీ విద్యార్థులకి పిలుపునిచ్చారు…
ఈ కార్యక్రమంలో విస్తరక్ గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వంగ.సంజీవ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్యామ.శ్రీకాంత్,శంషాబాద్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ ఉబ్బటి.హరి కృష్ణ,భవిష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.