సిపిఐ బస్సుయాత్ర జయప్రదం చెయ్యాలి..

*సిపిఐ బస్సుయాత్ర జయప్రదం చెయ్యాలి…*

— రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ రావు..

_డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరులో శుక్రవారం స్థానిక సమతా కార్యాలయం నందు కొత్తపేట నియోజకవర్గం కార్యదర్శి కొండే రామకృష్ణ అధ్యక్షతన సిపిఐ జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు జరగబోయే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జరుపుతున్న బస్సు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ఆగస్టు 21వ తేదీన అమలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లాలోని అన్ని మండల శాఖల నుండి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో ఆగస్టు 9వ తేదీన జరగబోయే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సిపిఐ సెక్రెటరీ కే.సత్తిబాబు, రామచంద్రపురం నియోజకవర్గ కార్యదర్శి పి.రాము, ముమ్మిడివరం నియోజకవర్గ కార్యదర్శి శీలం వెంకటేష్, అమలాపురం నియోజకవర్గం కార్యదర్శి ఎన్. శ్రీనివాస్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వి.శ్యామ్యూల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ జి.రవికుమార్,ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ బి.బాలకృష్ణ, పలువురు మండల కార్యదర్శులు పాల్గొన్నారు._

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!