*జగనన్న మంచికి, చంద్రబాబు చెడుకి మధ్యే ఈసారి ఎన్నికల యుద్ధం – ఎమ్మెల్యే భూమన*
తిరుపతి( స్టూడియో 10 న్యూస్ )
రాష్ట్రంలో నిరంతరం ప్రజాభివృద్ధికి పాటుపడుతున్న జగనన్న మంచికి, నిత్యం అసత్య ఆరోపణలతో వెలుతున్న చంద్రబాబు ముఠా చెడుకి మధ్యే ఈసారి ఎన్నికల యుద్ధం జరగనుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి 30వ డివిజన్ నెహ్రూనగర్లో గురువారం ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమన ఇంటింటికి వెల్లి వారితో మాట్లాడుతూ జగనన్నకి తోడుగా నిలవాలన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ జగనన్న చేసిన మంచి పనుల పట్ల ప్రజలంతా ఎంత కృతజ్ఞత చూపుతున్నారంటే ఈ డివిజన్ అంతా కిక్కరిసిపోయే విధంగా ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి విచ్చేసి స్వాగతిస్తున్నారని భూమన ఆనందం వ్యక్తం చేసారు. మళ్లీ జగనన్నకే ఓట్లు వేస్తామని బలంగా ప్రోత్సహిస్తూ, ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు పులకితులవుతున్న ప్రజలకు, మరోవైపు ఈర్షతో రెచ్చిపోతున్న ప్రతిపక్షాలకి మధ్య వచ్చే ఎన్నికల్లో యుద్ధం జరగనుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి మంచికి, చంద్రబాబు అతనికి కాపు గాస్తున్న ప్రతిపక్షాల చెడుకి మధ్య జరుగుతున్న యుద్దంగా అభివర్ణించారు. ప్రజలు మంచిని కోరుకుంటారే తప్ప దుర్మార్గపు పాలన అందించిన చంద్రబాబును చెడును మాత్రం కోరుకోరని స్పష్టం చేశారు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున తమను ఆశీర్వదిస్తుండడమే ఇందుకు కారణంగా భూమన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, ఆ డివిజన్ కార్పొరేటర్ కల్పన యాదవ్, ఇతర కార్పొరేటర్లు నరసింహాచారి, తిరుపతి మునిరామిరెడ్డి, నరేంధ్రనాధ్, కో ఆప్షన్ సభ్యులు ఇమామ్ సాహేబ్, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇమ్రాన్, యాదవకృష్ణ, కట్టా గోఫియాదవ్, రవి, జ్యోతిప్రకాష్, కంకనాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.