*ఎమ్మెల్యే ప్రారంభించారు! – పగులగొట్టారు?*
*–45 లక్షల సీసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శిలా ఫలకాన్ని 48 గంటల్లో తొలగించిన వైనం*
*ఎవరు తొలగించారో కూడా అధికారులకు తెలియని వైనం*
ప్రకాశం జిల్లా :: కంభం:
ఆ ఎమ్మెల్యే శంఖుస్థాపన చేసిన శిలా ఫలకాన్ని రెండు రోజులోనే పగులగొట్టిన ఘటన ప్రకాశం జిల్లా లో చోటు చేసుకుంది.
45 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్లకు శంకు స్థాపన చేస్తే దానిని అధకారులు పగుల గొట్టి తొలగించారు.
వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా కంభం మండలం హజరత్ గూడెం గ్రామ పంచాయితి లో సోమవారం నాడు 45 లక్షల రూపాయల వ్యయం తో అంతర్గత సిసి రోడ్డు నిర్మాణమునకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.అంతవరకు బాగానే ఉంది కానీ శంకుస్థాపన చేసిన శిలా ఫాలకాన్ని మాత్రం అమరావతి – అనంతపురం జాతీయ రహదరిపై అదికూడా ఇరిగేషన్ కాలువ వంతెన పై ఏర్పాటు చేశారు.దీనితో ఆ శిలాఫలకాన్ని పగులగొట్టి తొలగించారు.ఇప్పటికీ ఎవరు తొలగించారు అనేది పంచాయితి సెక్రెటరీ కి కానీ లేదా మండల స్థాయి అధికారులకు కానీ తెలియక పోవడం గమనార్హం.లక్షల రూపాయల ప్రజా దనం ఉపయోగించి వేసే సి సి రోడ్ల నిర్మాణానికి సంభందించిన సమాచారం కూడా సదరు మండల స్థాయి అధికారుల వద్ద లేక పోవడం ఆశ్యర్యానికి గురి చేస్తుంది.
అయితే తిరిగి మరల యధా విధిగా దాని పక్కనే నూతనంగా బుదవారం నాడు హుటాహుటిన ఇంకొక్క శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు.ఇక్కడ మతలబు ఏమిటంటే తిరిగి మరల జాతీయ రహదారి పై పరిధిలో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం బయటికి తెలియడం తో చర్చనీయాంశం గా మారింది. ఇంకోసారి ఆ శిలా ఫలకాన్ని అధికారులు తొలగిస్తారా లేదా అంటూ ప్రజలు గుస గుస లాడుకుంటున్నారు.