తిరుపతి( స్టూడియో 10 న్యూస్ )
స్వాతంత్ర సమరయోధులు, విప్లవ వీరులు, మన్యం దొర, అల్లూరి సీతారామరాజు వారసులు మనవడు అయినటువంటి అల్లూరి శ్రీరామరాజుతో తిరుపతిలో క్షత్రియ నాయకులు గురువారం సమావేశం అవ్వడం జరిగింది. తిరుపతి క్షత్రియ సేవా సమితి గౌరవ అధ్యక్షులు కే.ఎల్.వర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అల్లూరి శ్రీరామరాజు సమక్షంలో క్షత్రియ అసోసియేషన్ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది. రాయలసీమలో ప్రధాన పట్టణమైనటువంటి తిరుపతిలో క్షత్రియ అసోసియేషన్ కార్యక్రమాలు బాగా చేస్తున్నారని వర్మను ఆయన అభినందించడం జరిగింది. క్షత్రియులలో యువత ఎక్కువమంది బాగా చదువుకొని అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నారని, వారందరినీ కూడా ఏకతాటి మీదికి తీసుకువచ్చి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని శ్రీరామరాజు సూచించారు. ఇప్పటికే తిరుపతిలో శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహ ప్రతిష్టాపనకు అంగీకరించి ఉన్నారని, త్వరలో పనులు చేపట్టి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని, అందుకు అల్లూరి శ్రీరామరాజు హాజరు కావల్సిందిగ ఆయనను వర్మ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రాధాకృష్ణ వర్మ, నెహ్రూ రాజు, వైయస్ రాజు, జగదాబి గోపి, అనిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.