*జగనన్నపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తున్నది – ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి*
తిరుపతి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పనితీరు పట్ల, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తున్నదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలోని 22వ డివిజన్ ఎల్.ఎస్. నగర్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి ఇంటింటికి వెల్లి ప్రజలతో మాట్లాడుతూ, జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. జగనన్న ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు తమ సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తూ, మళ్ళీ జగనన్నకే ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొస్తామని ముక్తకంఠంతో చెప్పారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడుతూ ఎల్.ఎస్ నగర్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, టీటీడీ ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా నివసిస్తున్న ఈ ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీంతో అన్ని పనులను త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. జగనన్నకు తామంతా పరిపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని ఆయన తెలిపారు. గతంలో చంద్రబాబుకు పనిచేసిన వారంతా కూడా ఈసారి జగనన్నకే ఓట్లు వేస్తామని అంటున్నారని భూమన సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష, 22వ డివిజన్ కార్పొరేటర్ పైడి సునిత, ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ నైనార్ శ్రీనివాసులు, కార్పొరేటర్ ఆరణి సంధ్య, గంగమ్మగుడి చైర్మెన్ కట్టా గోఫి యాదవ్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు మాకం చంధ్ర, జ్యోతిప్రకాష్, నాయకులు పైడి చంధ్ర, కిరణ్, శివశంకర్ రెడ్డి, గోవింధరెడ్డి, సుదర్శన్ రెడ్డి, పడమట కుమార్, వీర అనీల్, తిమ్మారెడ్డి, రెడ్డిరాణి, తలారి రాజేంధ్ర, దేవధానం, రమేష్, స్టోర్ నాధముని, గీతా యాదవ్, మునిసిపల్ హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, డిఈ మహేష్, శానిటరి సూపర్ వైజర్ చెంచెయ్య, ఆర్.ఐ.రాజశేఖర్, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు.