సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొల్లినేని శ్రీధర్ రూ.11లక్షలు విరాళం
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలంలో పునర్నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి విరాళాల వెల్లువ మొదలైంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చొరవతో విరాళాలు పెద్ద ఎత్తున కార్యరూపం దాల్చింది. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ ద్వారా సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొల్లినేని శ్రీధర్ 11 లక్షల రూపాయలను ప్రకటించారు. అయ్యప్ప స్వామి దేవాలయానికి విరాళంగా త్వరలోనే ప్రముఖ న్యాయవాది మోముల బసప్ప ద్వారా 11 లక్షల రూపాయలను ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేస్తారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. అడిగిన వెంటనే విరాళాలు ఇచ్చేందుకు ఆధ్యాత్మిక చింతనతో ఎంతో భక్తి భావంతో ముందుకు వస్తున్న తన స్నేహితులకు, ప్రముఖులకు పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది అందరూ సమిష్టిగా చేయాల్సిన కార్యక్రమం అనీ అందరూ సంఘటితంగా కలిసి ఆ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామిని ప్రతిష్టించుకుంటే మేలు జరుగుతుందని, ఆ దేవుని కొలిస్తే సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని గణేష్ పేర్కొన్నారు. రెండున్నర కోట్ల రూపాయల విరాళాల సేకరణకు తాను శ్రీకారం చుట్టినట్టు మరోసారి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ప్రముఖులతో కలిసి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఉదృతం చేసినట్టు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే లలిత జువెలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ కుమార్ 15 లక్షల రూపాయలు ప్రకటించారని మరోసారి గుర్తు చేశారు. అదేవిధంగా తాను కూడా 11 లక్షల ఇరవై మూడు వేల రూపాయలను విరాళంగా ప్రకటించినట్టు తెలిపారు. అదేవిధంగా పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల రవి కుమార్ గుప్తా 9 లక్షల రూపాయలు ప్రకటించారని, మరొకరు మరొకరు ఒక లక్ష పైచిలుకు రూపాయలు ప్రకటించారని ఇప్పటికే దాదాపు 47 లక్షల రూపాయలు విరాళాల రూపంలో అందుతున్నాయని మరిన్ని విరాళాలు వస్తున్నాయని బండ్ల గణేష్ తెలిపారు. అడిగిన వెంటనే ఆలయ నిర్మాణం కోసం ఎంతో పెద్ద మనసుతో పెద్ద ఎత్తున భారీ విరాళాలు ఇస్తున్న వారందరికీ భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విరాళాల ఉద్యమం మరింత ఉధృతం చేస్తూ ఆలయ నిర్మాణానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గణేష్ పేర్కొన్నారు..