చేవెళ్ల,జూన్ 26 : చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలలో అదే గ్రామానికి చెందిన గంగిడి మధుసూదన్ రెడ్డి వారి మిత్రులు ఆధ్వర్యంలో పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గంగిడి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… పిల్లలకు నాణ్యమైన విద్యను బోధించాలని వారిని ఉత్తీర్ణతులుగా తీర్చిదిద్దిడానికి పాటుపడాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎల్లవేళల తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు ఇతర సామాగ్రి అందించడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. పేద విద్యార్థుల విద్య కొరకై దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులకు సేవా కార్యక్రమాలు చేస్తున్న గంగిడి మధుసూదన్ రెడ్డిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.