మహిళా అభివృద్ధి కేంద్రం ప్రారంభించిన ‘కొండ విశ్వేశ్వర్ రెడ్డి’
చేవెళ్ల,జూన్ 26 : చేవెళ్ల మండలం ధర్మ సాగరం గ్రామంలో జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అమ్మగారి స్మారకర్థం ” సోమవారం జయలతమ్మ మహిళ అభివృద్ధి కేంద్రం” ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడం కోసం పని చేస్తుందని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పద్మ , దేవుని ఎర్రవల్లి సర్పంచ్ మాణిక్ రెడ్డి , బిజెపి నాయకులు ప్రకాష్ కంజర్ల, బిజెపి మండల అధ్యక్షులు దేవర పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, అదెట్ల శ్రీనివాస్, గుర్రాల శ్రీపాల్ రెడ్డి, గౌండ్ల కృష్ణ గౌడ్, కుంచం శ్రీనివాస్, కుమార్ గౌడ్, సామ కృష్ణారెడ్డి పాలమాకుల రవీందర్ , బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తి సత్యనారాయణ యాదవ్, బండారి చంద్రశేఖర్ రెడ్డి, బాల్ రెడ్డి, కృష్ణమోహన్, మధుకర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, సంగారెడ్డి, చంద్రా రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.