ఎంపీపీల సంఘం నాయకులతో భవిష్యత్తు ప్రణాళికపై చర్చ


అనంతగిరి ఎంపీపీ సోషల్ మీడియా; రాష్ట్రంలోని ఎంపీపీలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి ఎంపీపీల సంక్షేమ సంఘం తరఫున చేయబోయే కార్యచరణ పై రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం పలువురు ఎంపీపీలు కలిసి చర్చించడం జరిగింది .కాకినాడ జిల్లా రౌతులపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి పై దాడికి నిరసనగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఇటువంటివి భవిష్యత్ లో పునరావృత్తం కాకుండా సంఘం తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని దానిపై చర్చించారు. ST విభాగం నీలవేణి ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు గౌరవ సజ్జల రామకృష్ణ రెడ్డి గారి దృష్టికి ఎంపీపీల సమస్యలపై విన్నవించడాన్ని ఎంపీపీ లు హర్షించారు. ఎంపీపీ లంతా సమిష్టిగా ఏకతాటిపై ఉండాలని అందుకు అనుగుణంగా జిల్లా అధ్యక్షులు సభ్యులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సంతృప్తికరంగా ఉన్నాయని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంపీపీల పైన ఉంటుందని చర్చించారు ఈ కార్యక్రమంలో నల్లచెరువు ఎంపీపీ కదిరి జిల్లా అధ్యక్షులు రమణారావు గారు ఏలేశ్వరం ఎంపీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బుజ్జి గారు ఎస్ టి విబాగా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శెట్టి నీలవేణి తోపాటు అనంతగిరి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు శెట్టి ఆనంద్, పి ఎస్ సి ఎస్ చైర్మన్ కృష్ణ మూర్తి శ్రీను తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!