*భారతదేశ గౌరవ పురస్కారం 2023 అవార్డు అందుకున్న 31వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు..*
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 31వ వార్డు *కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్* గారు ఒక మహిళా కౌన్సిలర్ అయినప్పటికీ కరోనా సమయంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు, ఇతర మరిన్ని సేవా కార్యక్రమాలను గుర్తించిన ఇంటర్నేషనల్ మయూరి ఆర్ట్స్ వారు ఈరోజు కౌన్సిలర్ *మాలె గాయత్రి లక్ష్మణ్ గారిని ఇండియన్ హానరబుల్ (భారతదేశ గౌరవ పురస్కారాలు) 2023 అవార్డు* ఇచ్చి గౌరవించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ గారు మాట్లాడుతూ ప్రజలకు ముఖ్యంగా మా వార్డు ప్రజలకు సేవ చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. భవిష్యత్తులో కూడా నా వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి సమస్య పరిష్కరిస్తానని అన్నారు. ఇంతమంది ప్రముఖుల మధ్యలో అవార్డు తీసుకోవడం చాలా ఆనందం ఇస్తుందని అన్నారు.