మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రీమియం అందజేత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రీమియం అందజేత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

*సర్పంచ్ లు, ఎంపీటీసీలకు ఉచిత వైద్య భీమా*

* *రూ .5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు*

*ప్రీమియంకు సొంత నిధులు రూ.9 లక్షలు చెల్లింపు*

*మండలంలో రూ.79.05 కోట్ల అభివృద్ధి పనులు*

*పంచాయతీల పరిధిలో పలు అంశాలపై వినతులు స్వీకరణ*

తిరుపతి రూరల్
పంచాయతీ పరిధిలో ప్రజా ప్రతినిధులు ఆరోగ్య పరిరక్షణకు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చొరవ తీసుకున్నారు. పంచాయతీల పరిధిలో సర్పంచ్ లు, ఎంపీటీసీ లు ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని భావించారు. ఈ క్రమంలో రూ.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు ప్రజా ప్రతినిధుల (భార్య, భర్త)కు వర్తింపజేసే వైద్య భీమా ప్రీమియంకు రూ.9 లక్షలు తన సొంత నిధులు చెల్లించారు. భీమా ప్రీమియం ప్రతిని సర్పంచ్ లు, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందజేశారు. శనివారం తిరుపతి రూరల్ మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం.. ప్రీమియం ప్రతిని అందజేసే బృహత్తర కార్యక్రమానికి వేదికైంది. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మండల పరిధిలో 34 మంది సర్పంచ్ లు, 39 మంది ఎంపీటీసీలకు సొంత నిధులు రూ.9 లక్షలతో ఉచిత వైద్య భీమా సదుపాయాన్ని కల్పించడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఎంపీపీ మోహిత్ రెడ్డి కృషిని అభినందించారు. మోహిత్ రెడ్డి ఎంపీపీగా ఒక్క మండలానికే పరిమితం కాకుండా.. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గంలో మిగిలిన 5 మండలాల్లోని ప్రజాప్రతినిధులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని మోహిత్ రెడ్డి ఈ సందర్భంగా ఉదహరించారు. దేశంలోనే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్య సేవలు పొందవచ్చని వెల్లడించారు.

*రూ.రూ.79,05,24,000 నిధులతో అభివృద్ధి పనులు*

తిరుపతి రూరల్ మండల పరిధిలో రూ.79 కోట్ల 05 లక్షల 24 వేల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 50 సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధిని నేడు చేసి చూపామన్నారు. ప్రతి పంచాయతీ అభివృద్ధి చెందాలి.. ప్రభుత్వ పాలనలో కులం, మతం, పార్టీ లకు అతీతంగా ప్రజలకు మంచి చేయాలని సూచించారు. అందరినీ సమానంగా చూడాలన్నారు.
ప్రభుత్వం తరపున చేసే ఏ పనైనా.. సమానంగా జరగాలని తెలియజేశారు. ప్రజలకు మంచి చేయడంలో అందరూ పోటీ పడాలని పిలుపునిచ్చారు. రోడ్లు, కాలువలు, ధ్యాన మందిరాలు, సమావేశ మందిరం, రచ్చ బండలు, జిమ్ లు , పార్కులు తదితర పనులను రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా చేపట్టామన్నారు. మండలంలో మరింత అభివృద్ది పరచడంలో మీ పాత్ర ప్రధానంగా ఉండాలని కోరారు.

*గైర్హాజరైన అధికారులపై ఎమ్మెల్యే అసహనం*

మండల సమావేశానికి ముందస్తు సమాచారం ఇచ్చినా గైర్హాజరైన అధికారుల పట్ల ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. హాజరు కాని అధికారులపై చర్యలకు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను గౌరవించ లేని వ్యవస్థలో ఉన్నామా.. అని ప్రశ్నించారు. ఇకపై జరిగే మండల సమావేశాలకు అన్ని విభాగాల అధికారులు తప్పక హాజరు కావాలని హెచ్చరించారు.

*కూలంకుశంగా చర్చ*

ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో విభాగాల వారీగా పంచాయతీలో నెలకొన్న సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై కూలంకుశంగా చర్చ సాగింది. రెవెన్యూ, విద్యుత్, రహదారులు, పంచాయతీ, పోలీస్ తదితర శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భవనాలు సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీపీ మోహిత్ రెడ్డి అధికారులకు సూచించారు. పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీ ల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ లు విడుదల మాధవ రెడ్డి, యశోద, ఎంపిడిఓ వెంకట నారాయణ, అర్బన్, రూరల్ తహశీల్దార్ లు వెంకట రమణ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!