గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ కమిటీ అత్యవసర సమావేశం…
రామవజ్జుల రవికుమార్ శర్మ మీడియా ముఖంగా శ్రీరామ శర్మకు క్షమాపణలు చెప్పాలి
సూర్యాపేట: గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్ష మరియు కార్యవర్గం సోమవారం సమావేశం ఏర్పాటు చేసి వ్యవస్థాపక కమిటీ ఆధ్వర్యంలో సంఘానికి వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతూ సదరు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరామ శర్మ కు లేదా కమిటీ వారికి తెలియ పరచకుండా నిబద్ధత లేని పత్రిక ప్రకటనలు చేయటం సంఘం పేరుతో రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా దూషించడం వంటి విపత్కర విధానాన్ని అవలంబిస్తూ దూకుడు స్వభావంతో ముందుకు నడుస్తున్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి రామవజ్జుల రవికుమార్ శర్మను సంఘం వ్యవస్థాపక కమిటీ తన పదవుల నుండి తొలగించింది. ఈ విషయమై సంఘం తరుపున వ్యవస్థాపక కమిటీ ఆధ్వర్యంలో పత్రిక ప్రకటన జారీ చేసింది.అయినప్పటికీ రామవజ్జుల రవికుమార్ శర్మ తదుపరి పత్రికా ప్రకటనలు విడుదల చేస్తూ తను ఇంకను సంఘంలో కొనసాగుతున్నట్లు పదవులను తన పేరుకు ముందు తగిలించుకొని వ్యవస్థాపక కమిటీ నిర్ణయాన్ని దిక్కరించటం పట్ల సంఘం వ్యవస్థాపక కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీరామ శర్మను పత్రిక ప్రకటన ముఖంగా దూషించడం పట్ల గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం మరియు పలు ప్రాంతీయ సంఘాల నేతలు తీవ్ర వ్యవతిరేకత చూపుతున్నారు.ఇటువంటి ఆగడాలకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక కమిటీ నిర్ణయించింది. ఈ విషయమై రామవజ్జుల రవికుమార్ శర్మ మీడియా ముఖంగా గర్నెపుడి శ్రీరామ్ శర్మ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడుకి క్షమాపణలు చెప్పాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు..