*వాలంటీర్ల సేవలు అభినందనీయం..*
— గ్రామ వాలంటీర్లు నిజమైన సేవకులు..
— ప్రభుత్వ విప్,శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి..
*_రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ నాతి లావణ్య కుమార్ రాజా,పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం గ్రామ సచివాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్,శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా చిర్ల సేవారత్న ద్వారా 20,000 వేల నగదును సాధిచిన తాతపూడి హారికతో పాటుగా సేవామిత్రా ద్వారా 10,000 వేల నగదు సాధించిన 56 మంది వాలంటీర్లను అభినందించి దృశ్లువాలు కప్పి,పూలమాలతో ఘనంగా సన్మానించి అవార్డులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు సేవలు వెలకట్టలేనివని,వాలంటీర్లు సంక్షేమ సేవకులని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారని తెలిపారు.జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని,వరుసగా మూడో ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని,కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎంతో విశేష సేవలు అందించారని,ఇన్ని సంక్షేమ,అభివృద్ధి పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులని చెప్పవచ్చు అన్నారు.ప్రతి నెల ఒకటో తేదీన సూర్యుడు కంటే ముందుగా అవ్వ తాతలకు,అర్హులైన ఇతరులకు వారి ఇళ్ళ ముంగిటకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని అన్నారు.జగనన్నకు మంచి పేరు తెచ్చేలా మీరు పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్,చెముడులంక గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర సేవాదల సంయుక్త కార్యదర్శి,డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు,వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, కర్రీ నాగిరెడ్డి,ఆలమూరు వైసిపి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రావడ సత్తిబాబు,పిఎసిఎస్సి అధ్యక్షులు నెక్కంటి వెంకటరాయుడు (బుజ్జి),వనెం జార్జిబాబు, పలుశాఖల అధికారులు,ఎంపీటీసీ సభ్యులు,వార్డ్ మెంబర్లు,వైసిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు._*