*అన్నదాతలు యంత్ర సామాగ్రితో అధిక దిగుబడులు సాధించవచ్చు..*
— ప్రభుత్వ విప్,శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి..
_ఆధునిక యంత్రాలతో అన్నదాతలు అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రభుత్వ విప్,శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.గురువారం ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు సచివాలయం-2 పరిధిలో డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రం ద్వారా 40 శాతం రాయితీతో మంజూరైన రూ.14,55,500 విలువచేసే ఏడు కృషి ట్రాక్టర్లును ప్రారంభించి,శ్రీ కరుణ సి.హెచ్.సీ గ్రూప్ సభ్యులకు 4 లక్షల 90 వేల రూపాయల సబ్జిడితో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ కూలీలు దొరకక వ్యవసాయం ఆటుపోట్ల మధ్య కొనసాగుతుందని కృషి ట్రాక్టర్లు వంటి యంత్ర సామాగ్రితో రైతులకు ఖర్చులు భారీగా తగ్గుతాయని అన్నారు. ఈ యంత్రాలను ఉపయోగించుకుని వ్యవసాయం చేపడితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో సోమిరెడ్డి లక్ష్మి లావణ్య, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు._