అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు గర్భిణీ స్త్రీలకు ప్రధానమంత్రి మాతృత్వ వందన కార్యక్రమం లో భాగంగా రక్తపరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు అందించి మందులు అందజేసినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వాసంతి తెలిపారు అలాగే ఈ కార్యక్రమం లో పీహెచ్ఎన్ సికి రత్న సఖి హెల్త్ విజిటర్ సిహెచ్ రవణ ఆరోగ్య విస్తరణ అధికారులు కంటపరెడ్డి నాగేశ్వరరావు మరియు బి సత్యనారాయణ గారు పర్యవేక్షణలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వై అనుష, లిల్లీ, శ్రావణి, అషిషిన్ టోప్నో,సచివాలయం హెల్త్ సెక్రెటరీ లు పి.నూకరత్నం, ఓ.వేణు, విజయ, శ్రీరాములు, రాజేశ్వరి,ఆశా, వరలక్ష్మి,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే హెల్త్ అసిస్టెంట్ మరియు మలేరియా ఇంఛార్జి నోడల్ అధికారి పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ గర్భిణీ స్త్రీలు ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి ఫోషకాహరం తీసుకోవాలని తప్పనిసరిగా ప్రతి నెల తప్పనిసరిగా పి.హెచ్.సి కి వచ్చి డాక్టర్ తో తనిఖీ చేయించుకొని తగిన సూచనలు సలహాలు తీసుకొని ఆరోగ్యం గా వున్న బిడ్డకు జన్మనివ్వాలని వారు సూచించారు.