*ప్రతి గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు*
మంగళవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్”* గారు *”మీతో నేను”* కార్యక్రమంలో భాగంగా *మోమిన్ పేట్ మండల కేంద్రంలో* ఉదయం *06:30 AM* నుండి *10:30 PM* వరకు పర్యటించారు.
*◆ వర్షాకాలం సమీపిస్తున్న వేల గ్రామాల్లో ఐరన్ పోల్స్ ను తీసివేయాలని, వాటి స్థానంలో మరియు అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని, లో ఓల్టేజ్ సమస్య ఉండటంతో… 100KV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.*
◆ 2,3,6,7,8 వ వార్డులలో నీటి సమస్యను పరిష్కరించాలని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ కచ్చితంగా ఇవ్వాలని, ప్రజలు ఎవ్వరు కూడా నల్లాలకు చెర్రలు తీయరాదని సూచించారు, నూతనంగా మరో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.
◆ గ్రామంలో పాడుబడ్డ ఇళ్లను తొలగించాలని, పల్లె ప్రగతిలో చేయలేని పెండింగ్ పనులన్ని పూర్తి చేయాలని, ములుగు కాలువలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ… గ్రామాన్ని ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ, ప్రతిరోజూ చెత్త సేకరణ చేయాలన్నారు.
◆ గ్రామంలో రోడ్లు, మురుగు
కాలువల నిర్మాణం మరియు పలు అభివృద్ధి పనులకు కృషి చేస్తామన్నారు.
◆ సురక్షితమైన మిషన్ భగీరథ మంచినీటిని ప్రజలందరూ త్రాగాలని, అందుకు అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు.
◆ ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.