పశుసంవర్ధక శాఖ,పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం
స్టూడియో 10 టీవీ న్యూస్, మే02, మహానంది:
మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగ దూడల పశు ప్రదర్శన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా నంద్యాల డి ఎల్ డి ఏ డిడి డాక్టర్ రాజశేఖర్, డిడి డాక్టర్ కే సి వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఆదాయపరంగా ఉండేందుకు పశుసంపదను వృద్ధి చేయడంలో గణనీయమైన ఫలితాలను సాధిస్తున్నామని, కొయ్య దూడల కోసమే కృత్రిమ గర్బాధారణ చేయడం వలన కొయ్యదూడలు వృద్ధి చెందుతాయని, వీటితో రైతులకు పాడి వృద్ధి చెందుతుందని, దీనితో పాటు పంటలను వేసుకోవడం ద్వారా ఆర్థికంగా పురోగతిని సాధించగలరని, మంచి నాణ్యమైన దూడలు వస్తాయన్నారు.అనంతరం పాడి పశువులకు బహుమతులతో పాటు, బలవర్ధకమైన ఆహారాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్, వెటర్నిటీ లైవ్ స్టాక్ అసిస్టెంట్ సులోచన, మండల ఉపాధ్యక్షురాలు కుంచపు లక్ష్మీనరసమ్మ, గ్రామ సర్పంచ్ కందుల వరలక్ష్మి, గ్రామ పెద్దలు వెంకటసుబ్బారెడ్డి గోపాలమిత్రులు సంజీవ , నాగరాజు, ఏ హెచ్ ఏ షారుక్ పాల్గొన్నారు.