బిస్మిల్లా భారత్ గ్యాస్ ట్రాలీ ఆటో నుంచి ఏడు సిలిండర్లు చోరీ
స్టూడియో 10 టీవీ న్యూస్, మే02, మహానంది:
బిస్మిల్లా భారత్ గ్యాస్ ర్యాలీ ఆటో నుంచి ఏడు సిలిండర్లు చోరీ జరిగిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.మహానంది మండలం ఆర్ ఎస్ గాజులపల్లె గ్రామంలో బిస్మిల్లా భారత్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన గ్యాస్ సిలెండర్ల ట్రాలీ ఆటో నుంచి ఏడు సిలిండర్లు చోరీ జరిగినట్లు బాధితుడు కాకర్ల బాలసుబ్రమణ్యం మంగళవారం తెలిపారు. గత రాత్రి ట్రాలీ ఆటో డోర్ డెలివరీ ముగించుకొని 9 గంటల సమయంలో ఇంటి వద్ద గ్యాస్ ట్రాలీ ఆటో నిలిపానని, ఉదయం లేవగానే చూడగా ట్రాలీ ఆటోకు వేసిన వెనకవైపు తాళాలు పగలగొట్టి భారత్ గ్యాస్ ట్రాలీ ఆటో నుంచి ఏడు సిలిండర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని వాపోయాడు. భారత్ గ్యాస్ డిలివరీ ట్రాలీ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తెలిపాడు.ఈ ఘటనపై మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ దర్యాప్తు చేపట్టారు.