మహానంది క్షేత్రంలో జరగబోవు కుంభాభిషేకం,కలశ పూజలను సమన్వయంతో విజయవంతం చేద్దాం-ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, మే02, మహానంది:
మహానంది క్షేత్రంలో జూన్ నెలలో జరగబోయే కుంభాబిషేకం, శిఖర కలశ ప్రతిష్ట లకు సంబంధించిన వైదీక ఏర్పాట్లు, ఇంజినీరింగ్ విభాగపు ఏర్పాట్లు పరిపాలన పరమైన ఏర్పాట్ల గురించి ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఛైర్మెన్ కొమ్మా మహేశ్వర రెడ్డి,ల ఆధ్వర్యంలో వేదపండితులు,అర్చకులు, పరిపాలనా సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పాలకమండలి చైర్మన్ మరియు ఆలయ ఈవో మాట్లాడుతూ క్షేత్రంలో 20 సంవత్సరాల తర్వాత జరగబోవు కుంభాభిషేకము, కలశ పూజ కార్యక్రమాలను త్వరగా కార్యాచరణ ప్రారంభించి అందరూ కలిసి దిగ్విజయం చేద్దామని తెలిపారు. అంతేకాకుండా ఈ విశేష పూజా కార్యక్రమాలు జరగడం అంటే మా పూర్వజన్మ సుకృతం అని , ఈ కార్యక్రమాన్ని అందరూ పెద్ద పండగలాగా భావించి భక్తితో పాల్గొనాలని అన్నారు. ఆలయ పేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ క్షేత్రంలో జరగబోవు కుంభాభిషేకము, కలశపూజ కార్యక్రమం లో పాల్గొనేందుకు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జూన్ మొదటి వారంలో ఒక తేది ఫిక్స్ చేసుకొని వచ్చేందుకు అంగీకరించారని అన్నారు. ఈ కుంభాభిషేకము, కలిశపూజ కార్యక్రమాలు గత 20 సంవత్సరాల నుండి చాలా పర్యాయాలు చేయాలని ప్రయత్నించిన ఆచరణలోకి రాలేదని అన్నారు. ప్రస్తుత ఆలయ ఈవో, పాలకమండలి చైర్మన్ ల సహకారంతో ఈ దిగ్విజయ కార్యక్రమం జరగబోతుందని తెలిపారు. అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాలు చాలా వ్యయ ప్రయాసలతో కూడిన కార్యక్రమం కావున ఈ పూజలకు విశేష పూజా ద్రవ్యాలు, విశేషం పూల మాలలు, పూలు, యాగశాల మండపము ఏర్పాటు చేసుకోవలసి ఉంది అన్నారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు, సిబ్బంది అందరూ సమన్వయంతో విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు మాట్లాడుతూ క్షేత్రంలో జరగబోవు కుంభాభిషేకము కలశపూజ కార్యక్రమాలను గూర్చి తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించి ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు విశేషంగా పాల్గొనే విధంగా అందరూ కృషి చేయాలని తెలిపారు. అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.