అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో జె.వి.పాలెం సచివాలయం పరిధి వేమగిరి గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా మలేరియా అధికారి కె.వరాహలు దొర ఆదేశాలు మేరకు, మలేరియా సబ్ యూనిట్ అధికారి పి.జె.ఎం.అర్.పి.నాయుడు సూచనలు మేరకు కీటక జనిత వ్యాధులపై అవగాహన శిబిరం
నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.ఎస్.వీ శక్తి ప్రియ ,ఆరోగ్య విస్తరణ అధికారి బి.సత్యనారాయణ పర్యవేక్షణలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వీణా వాహిని ఆధ్వర్యంలో బి .రాజేశ్వరి సచివాలయం హెల్త్ సెక్రెటరీ, గ్రామ వాలంటీర్లు, గ్రామ పెద్దలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, బాలింతలు ఈ అవగాహన సభలో పాల్గొనగా వారికి కీటక జనిత వ్యాధులైన డెంగీ , చికెన్ గునియా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు జ్వరాలు రాకుండా వుండాలంటే దోమలు వృద్ది చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అనగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, తద్వారా దోమ కాటు వలన కలిగే అనారోగ్యం బారి నుంచి తప్పించుకోవచ్చునని డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ ప్రజలకు సూచించారు.