*వెంకటాపూర్ తండాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన వడ్ల నందు*
వెంకటాపూర్ తండాలో బిఆర్ఎస్ జెండా ఎగరవేసిన వడ్ల నందు
వికారాబాద్: టిఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం నేడు నిర్వహిస్తున్న బిఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ తండాలో బిఆర్ఎస్ నాయకులు వడ్ల నందు మంగళవారం ఉదయం పార్టీ జెండాను ఆవిష్కరించారు. 6వవార్డు కౌన్సిలర్ చందర్ నాయక్ ,దారుర్ వైస్ ఎంపీపీ విజయ్ నాయక్ లతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం స్థాపించిన పార్టీ నేడు అధికారంలో ఉందని రాబోయే రోజుల్లో మరోసారి ప్రజలు టిఆర్ఎస్ ను దీవించడం ఖాయమని అన్నారు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పార్టీ ఆదేశానుసారం నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.