కొందూర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి
మతాల పేరిట విధ్వంసం సృష్టిస్తామంటే ఎవరు ఊరుకోరు
అధికారం చేతిలో ఉంది కదా అని కుల మతాల పేరిట విధ్వంసం సృష్టిస్తామంటే తెలంగాణలో చెల్లదని గుజరాతీల గూడుపుఠాని ఇక్కడ సాగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ కోందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి హెచ్చరించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన సంచలన వ్యాఖ్యలపై సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడారు. దేశం తమ చేతిలో ఉందని విర్రవీగుతూ తాము ఏం చేసినా చెల్లుతుందని భ్రమ పడటం మానేయాలని హితవు పలికారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై ఐక్యతగా ఉన్నప్పుడే భరతమాత సంతోషపడుతుందని ఇలా మతాలను విడదీస్తూ స్వార్థ రాజకీయం కోసం అధికార దాహంతో వీర్రవీగుతుంటే ఆ భరతమాత కూడా బిజెపిని క్షమించదని అన్నారు. అందరూ భరతమాత ముద్దుబిడ్డలే అయినప్పుడు విభజించి పాలించడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో బిజెపి పిచ్చి ప్రకటనలు చేయడం మానివేయాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. సమాజం చంద్రమండలం వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కులం మతం అని అధికారం కోసం మదమెక్కినట్టు మాట్లాడితే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొందరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజిరెడ్డి, పర్వతాపూర్ మా దీప్తి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మల్లయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఇసాక్,
ఎండి సలీం, హమీద్, అజీమ్, అలీ, హైమద్, బుగ్గయ్య, కమ్మరి రాజు, శంకర్, రమేష్, శ్రీనివాస్, రామస్వామి, ఎండి ఆదిల్, ఎండి నహీం, వాజిద్, తదితరులు పాల్గొన్నారు..