మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కొండా మధుసూదన్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్ ఏప్రిల్ 24, మహానంది:
మహానంది మండలానికి నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జి .నాగేంద్ర ప్రసాద్ ని గాజులపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కొండా మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఎస్సై ని శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలుకుతూ పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా ఎస్సై నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మండలములో అందరి సహాయ సహకారాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలు నెలకొల్పేలా చర్యలు చేపడతామన్నారు. ప్రజలందరికీ తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు.