ఉపాధి హామీ పనులు ప్రారంభం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 17, మహానంది:
మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం పనులను ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షురాలు కుంచపు లక్ష్మీ నరసమ్మ,సర్పంచ్ కందుల వరలక్ష్మమ్మ సోమవారం నాడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కూలీలు అందరికీ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కూలీలు అందరూ సమయపాలన పాటించి పనులు సక్రమంగా చేయాలని సూచించారు.