*పాకాల గవర్నమెంట్ హై స్కూల్ నందు విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు పై అగ్నిమాపక సిబ్బందిచే అవగాహన*
పాకాల
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో గల గవర్నమెంట్ ఉన్నత పాఠశాల హై స్కూల్ నందు అగ్ని ప్రమాద నివారణ చర్యల గురించి మరియు అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏ విధంగా ఆర్పాలి అనే అంశంపై తగిన సూచనలు సలహాలు మరియు గ్యాస్ ఫైర్ గురించి ఆయిల్ ఫైర్ జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే అంశంపై సూచనలు ప్రాక్టికల్ గా అగ్నిమాపక సిబ్బంది చే నిర్వహించడం జరిగిందని మన చుట్టూ పరిసర ప్రాంతాల నందు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో అగ్నిమాపక సిబ్బంది వారు ప్రదర్శన చూపించడం జరిగిందని కరపత్రములు పంచి పాకాల అగ్నిమాపక అధికారి మరియు సిబ్బందితో కలిసి అగ్ని ప్రమాద నివారణ చర్యలు ప్రాక్టికల్ గా విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలియజేశారు అగ్నిమాపక ఎమర్జెన్సీ నెంబర్ పాకాల 08585222101.9963736957 నెంబర్లకు సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ k విశ్వనాథం డ్రైవర్ ఆపరేటర్లు భాస్కర్ అగ్నిబటులు రాజు. రాజేంద్ర బాబు. నాగార్జున.సురేంద్ర విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు