రేపు మంచిర్యాలలో జరగబోయే సత్యాగ్రహ సభను విజయవంతం చేయండి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి

రేపు మంచిర్యాలలో జరగబోయే సత్యాగ్రహ సభను విజయవంతం చేయండి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్:

ఈ నెల 14న మంచిర్యాలలో జరగబోయే సత్యాగ్రహ సభను ప్రజలు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ జయంతి రోజు మంచిర్యాల జిలాల్లో సత్యాగ్రహ సభ ఉంటుందని, దీనికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా వస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ పై పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడాని ప్రపంచము మొత్తం వ్యతిరేకిస్తున్నారని అన్నారు.ప్రజల డబ్బును ప్రధాని మోడీ అదాని కుటుంబానికి,ఆయన పెట్టుబడులకు లక్షల కోట్లు ఇచ్చారన్నారు.కొల్లర్ పట్టణంలో రాహుల్ గాంధీ మోదీ పేర్లతో ఉన్నవారి దేశాన్ని దోచుకుంటున్నారని అన్నారు.దానిలో ఎలాంటి తప్పు లేదని, దానిని విమర్శించినదుకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం సిగ్గు చేటు అన్నారు.ఆదాని,అంబానీలకు కట్టబెట్టిన రూ. 20 వెయ్యిల కోట్లను సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.దేశంలో ఉన్న జీవికె ఎయిర్పోర్ట్ ను,కృష్ణపట్నం పోర్టును ఆదాని హస్తగతము చేసుకున్నారని విమర్శించారు.రాహుల్ గాంధీ ని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడంతో ప్రతి పక్షలే కాకుండా బీజేపీ ఎంపీలు సైతం విమర్శించారని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ,దేశ ప్రధాని ఇద్దరు దోస్తులే అని,బయట తిట్టుకొని లోపల మాత్రం కలిసి ఉంటారని,నోట్ల రద్దు విషయంలో ప్రధానికి కేసీఆర్ సపోర్ట్ చేశారని, అలాగే రైతు చట్టాలకు కూడా సపోర్ట్ చేసి రైతుల ఉసురు తీశారని గుర్తు చేశారు. బయట ఒక్కరి పై ఒక్కరు దుమ్ము పోసుకుంటున్నారని,కానీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే పనిలో ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి,నాయకులు సత్యనారాయణ, మురళి,శ్రీనివాస్ ముదిరాజ్, తదితరులు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!